HomeMovie NewsBharateeyudu 3 Direct Release in OTT షాకింగ్ : డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్...

Bharateeyudu 3 Direct Release in OTT షాకింగ్ : డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ కానున్న ‘భారతీయుడు – 3’ ?

- Advertisement -

లోకనాయకుడు కమల్ హాస ప్రధాన పాత్రలో ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం భారతీయుడు 3 తెరకెక్కుతోంది. 

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని రెడ్ జెయింట్  మూవీస్ , లైకా ప్రొడక్షన్స్ సంస్థలు పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ఎస్ జె సూర్య నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్రోద్యమానికి సంబందించిన పౌ కీలక సన్నివేశాలు ఈ మూవీలో హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. 

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం భారతీయుడు 3 మూవీని డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ కానుందని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని తమ ఓటిటి లోనే డైరెక్ట్ గా మూవీన్నీ వారు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రానుందట.

Follow on Google News Follow on Whatsapp

See also  Rashmika Mandanna Following Shraddha Kapoor శ్రద్దా బాటలో రష్మిక మందన్న


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories